ఒకే రోజు 10 కొత్త వందే భారత్ రైళ్లకు ప్రధాని పచ్చ జెండా..
కొత్త రైళ్లను ప్రారంభించడమే కాకుండా, నాలుగు వందే భారత్ రైళ్ల పొడిగింపును కూడా ప్రధాని మోదీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు.;
కొత్త రైళ్లను ప్రారంభించడమే కాకుండా, నాలుగు వందే భారత్ రైళ్ల పొడిగింపును కూడా ప్రధాని మోదీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన మంత్రి మంగళవారం గుజరాత్‌లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్, ముంబై సెంట్రల్ మధ్య రైలుతో సహా 10 కొత్త వందే భారత్ రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. ఇది దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీకి పెద్ద ఊపునిస్తుంది.
ఈ రోజు ప్రారంభించిన 10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో మొత్తం సంఖ్య 50కి పెరుగుతుంది. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా 45 మార్గాలను కవర్ చేస్తుంటాయి. ప్రస్తుతం, భారతీయ రైల్వేలు దాదాపు 41 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను నడుపుతున్నాయి. బ్రాడ్ గేజ్ (BG) విద్యుద్దీకరణ నెట్‌వర్క్‌లతో రాష్ట్రాలను కలుపుతూ 24 రాష్ట్రాలు మరియు 256 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
కొత్తగా ప్రారంభించిన 10 రైళ్లు ఢిల్లీ-కత్రా, ఢిల్లీ-వారణాసి, ముంబై-అహ్మదాబాద్, మైసూరు-చెన్నై, కాసరగోడ్-తిరువనంతపురం, ఇప్పుడు విశాఖపట్నం-సికింద్రాబాద్ సహా ఆరు రూట్లలో రెండు వందే భారత్‌లు ఉంటాయి. ఈ రైళ్లు ప్రారంభించిన వెంటనే పట్టాలెక్కేస్తాయి.
2023 డిసెంబరులో ప్రధాని ఆరు అదనపు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఈ రైళ్లు కత్రా నుండి న్యూఢిల్లీకి అనుసంధానించే రెండవ రైలును కలిగి ఉన్నాయి. ఇతర వందే భారత్ మార్గాలలో అమృత్‌సర్ నుండి ఢిల్లీ, కోయంబత్తూరు నుండి బెంగళూరు, మంగళూరు నుండి మడ్‌గావ్, జల్నా నుండి ముంబై, అయోధ్య నుండి ఢిల్లీకి నడుస్తున్నాయి.
10 వందే భారత్ రైళ్లు: కొత్త మార్గాలు
అహ్మదాబాద్-ముంబై సెంట్రల్
సికింద్రాబాద్-విశాఖపట్నం
మైసూరు- డా. MGR సెంట్రల్ (చెన్నై)
పాట్నా- లక్నో
కొత్త జల్పైగురి-పాట్నా
పూరి-విశాఖపట్నం
లక్నో - డెహ్రాడూన్
కలబురగి - సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు
రాంచీ-వారణాసి
ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్)
ఇవి కాకుండా, నాలుగు వందే భారత్ రైళ్ల పొడిగింపును కూడా ప్రధాని మోదీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు.
అహ్మదాబాద్-జామ్‌నగర్ వందే భారత్ ద్వారక వరకు పొడిగించబడుతోంది
అజ్మీర్- ఢిల్లీ సరాయ్ రోహిల్లా వందే భారత్ చండీగఢ్ వరకు పొడిగించబడుతోంది
గోరఖ్‌పూర్-లక్నో వందే భారత్ ప్రయాగ్‌రాజ్ వరకు పొడిగించబడుతోంది
తిరువనంతపురం-కాసర్‌గోడ్ వందే భారత్‌ను మంగళూరు వరకు పొడిగిస్తున్నారు