పార్లమెంటు ఆవరణలో అధికార, విపక్ష ఎంపీల పోటాపోటీ నిరసనల మధ్య చోటుచేసుకున్న తోపులాటలో గాయపడిన బీజేపీ ఎంపీల ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఘటనకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ ఓ ఎంపీని తోయగా, ఆయన తన మీదపడడంతో బలమైన గాయమైనట్టు ఎంపీ ప్రతాప్ ఇదివరకే ఆరోపించారు. బీజేపీ ఎంపీలు అడ్డుకోవడం వల్లే అలా జరిగిందంటూ తరువాత రాహుల్ వివరణ ఇచ్చారు.
పార్లమెంటు అవరణలో నిరసన తెలుపుతున్న తనను బీజేపీ ఎంపీలు తోయడంతో మోకాలికి గాయమైనట్టు ఖర్గే ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ ఆయన లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. ఇది తనపై జరిగిన వ్యక్తిగత దాడి మాత్రమే కాదని, రాజ్యసభ ప్రతిపక్ష నేత హోదాపై జరిగిన దాడని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు తోయడం వల్లే కింద పడిపోయానని, ఇది వరకే సర్జరీ జరిగిన మోకాలికి గాయమైందన్నారు.