PM MEETS: ప్రధాని మోదీ వరుస సమీక్షలు

Update: 2025-05-10 05:00 GMT

భారత్‌పై పాకిస్థాన్‌ మళ్లీ డ్రోన్‌ దాడులకు తెగబడింది. పాక్‌ హద్దు మీరుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస సమీక్షలు నిర్వహించారు. తాజాగా విదేశాంగమంత్రి ఎస్‌ జైశంకర్‌తో తన నివాసంలో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీలు కూడా సమావేశంలో పాల్గొన్నారు.అంతకుముందు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌, త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ నిర్వహించారు. ఈ భేటీకి ముందు బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమావేశమయ్యారు. సరిహద్దుల్లో, విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.

Tags:    

Similar News