ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఆధునిక యుద్ధనౌకలు.. ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లను జాతికి అంకితం చేయనున్నారు. ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ యుద్ధనౌకల రాకతో నేవీ బలం పెరుగనుంది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామి కావాలన్న లక్ష్యసాధన దిశగా భారత్‌కు ఇది పెద్ద ముందడుగు అని కేంద్రం తెలిపింది. ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్.. పీ75 కింద రూపొందిస్తున్న ఆరో, చివరి జలాంతర్గామి. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు.