Mahakaleshwar Temple : మహాకాళేశ్వర్ ఆలయ అభివృద్ధికి రూ. 850 కోట్లు కేటాయింపు..
Mahakaleshwar Temple : మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు;
Mahakaleshwar Temple : మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. మహకాళేశ్వర్ టెంపుల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును ఫస్ట్ ఫేజ్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మొత్తం ఈ ప్రాజెక్టు కోసం 850 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా 316 ఖర్చు చేశారు. కార్యక్రమాన్ని చూసేందుకు శిప్రా నది ఘాట్‌లో LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.
900 మీటర్ల పొడువుతో మహాకాళ్ లోక్ కారిడార్ నిర్మాణం జరిగింది. ఇది దేశంలోనే అతిపెద్దది. పాత రుద్రసాగర్ లేక్ చుట్టూ విస్తరించి ఉంది. కారిడార్ ప్రారంభంలో రెండు గేట్ వేలు నంది ద్వార్, పినాకి ద్వార్ పేరుతో నిర్మించారు. 108 స్తంభాలు, ఫౌంటైన్‌లు ప్రత్యేక ఆకర్షణ నిలవనున్నాయి. శివపురాణం కథలు తెలియజేసేలా గోడలపూ చిత్రాలు గీశారు. మహాకాల్ లోక్ ప్రాజెక్టు కింద ఆలయ ప్రాంగణాన్ని దాదాపు 7 రెట్లు విస్తరించనున్నారు.