PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ సంచలన రికార్డు

Update: 2025-08-15 10:00 GMT

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి 103 నిమిషాల పాటు ప్రసంగించి కొత్త రికార్డు సృష్టించారు. ఇది భారతదేశ చరిత్రలో ఏ ప్రధాని చేసిన అత్యంత సుదీర్ఘమైన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం. గత ఏడాది 98 నిమిషాల ప్రసంగం రికార్డును ప్రధాని మోదీ ఈసారి అధిగమించారు. ఇప్పటివరకు వరుసగా 12వ సారి ఎర్రకోట నుంచి ప్రసంగించి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును కూడా బద్దలుకొట్టారు. అత్యధికంగా 17 సార్లు ప్రసంగించిన జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత మోదీ రెండో స్థానంలో ఉన్నారు. ఈ ప్రసంగంలో ఆయన 'ఆపరేషన్ సింధూర్', ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా, జీఎస్టీ సంస్కరణలు, ఉగ్రవాదం వంటి అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా 2035 నాటికి దేశాన్ని ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించడానికి 'సుదర్శన్ చక్ర' అనే రక్షణ వ్యవస్థను సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. పహెల్గామ్ ఊచకోతకు ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'లో పాల్గొన్న సైనికుల ధైర్యసాహసాలను ప్రధాని కొనియాడారు. చిన్న పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలకు లాభం చేకూరేలా, పండుగ సీజన్‌లో (దీపావళి నాటికి) కొన్ని కొత్త జీఎస్టీ సంస్కరణలను తీసుకురానున్నట్లు తెలిపారు. దేశం స్వయం సమృద్ధిని సాధించడంపై మరోసారి నొక్కిచెప్పారు, 'ఆత్మనిర్భర్ భారత్' & 'మేకిన్ ఇండియా' కార్యక్రమాల విజయాలను వివరించారు.

Tags:    

Similar News