Priyanka Gandhi: బీజేపీ రాజకీయాలను దిగజార్చుతోంది
మోడీపై ప్రియాంక గాంధీ డైరెక్ట్ ఎటాక్;
కాంగ్రెస్, బీజేపీ నడుమ ఎక్స్ లో పోస్టర్ వార్ జరుగుతోంది. ప్రధాని మోదీని.. జుమ్లాబాయ్, అతిపెద్ద అబద్ధాల కోరుగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ఎక్స్ లో లో ఓ పోస్టర్లు పెడితే.. 24 గంటలు కూడా తిరక్కముందే రాహుల్‌ను రావణుడిగా అభివర్ణిస్తూ బీజేపీ కాంగ్రెస్ కు దీటుగా సమాధానమిచ్చింది. దీంతో రెండు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రియాంక ఎక్స్ లో "ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజకీయాలను దిగజార్చుతున్నారు. హింసాత్మక ఫొటోలతో గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. మీరు నిజాయతీగా, విలువలతో కూడి ఉంటామని ప్రమాణం చేశారు. ఇదేనా మీ నిజాయతీ, విలువలు?" అని ప్రశ్నించారు.
ఎలక్షన్లు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ బుధవారం సాయంత్రం ‘‘పీఎం నరేంద్ర మోదీ యాజ్.. జుమ్లా బాయ్’’ అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో మోదీతోపాటు అమిత్‌షా ఫొటోనూ పెట్టింది. ఆ చిత్రాన్ని బీజేపీ సమర్పిస్తోందని ఎద్దేవా చేసింది. దీంతో, పాటు మోదీని ఎద్దేవా చేస్తూ పలు పోస్టులు చేసింది. దీనితో రాహుల్‌ను రావణుడుగా పేర్కొంటూ బీజేపీ తన ఎక్స్ ఖాతాలో గురువారం సాయంత్రం ఒక పోస్టు చేసింది. రాహుల్ కి పదిముఖాలను అమర్చి తయారుచేసిన ఆ పోస్టర్‌పై భాగంలో.. ‘‘రావణ్.. జార్జ్ సోరోస్ దర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్’’ అని ఉంది. బీజేపీ తన ఎక్స్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేసి.. ‘‘కొత్త తరం రావణుడు ఇక్కడున్నాడు. అతడు దైవ వ్యతిరేకి. ధర్మ వ్యతిరేకి, రామ వ్యతిరేకి. భారత్‌ను ధ్వంసం చేయడమే అతడి లక్ష్యం’’ అని పోస్ట్ చేసింది. ఇంతకీ బీజేపీ ఈ ఫొటోలో పేర్కొన్న జార్జ్ సోరోస్ అనే వ్యక్తి హంగరీ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, అపరకుబేరుడు. మోదీపై తరచూ విమర్శలు చేస్తుంటారు. దీంతో.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై సోరోస్ దాడి చేస్తున్నారని బీజేపీ తరచూ తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే సోరో్‌సకు, రాహుల్‌కు లింకు పెడుతూ పోస్టర్ ఉంచింది.
అయితే రాహుల్ గాంధీ రావణుడంటూ బిజెపి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చేసిన పోస్టుపై ఆయన సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాలను ఇంకెంత దిగజార్చాలని అనుకుంటున్నారంటూ ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను ఆమె ప్రశ్నించారు.