Project Shakthi By Kavya And Poorna: ఇద్దరు అమ్మాయిల సంకల్పం.. ఎంతోమంది పిల్లల చదువుకు శ్రీకారం..
Project Shakthi By Kavya And Poorna: పర్వతారోహణ ద్వారా వచ్చిన నిధులతో గర్ల్ ఎడ్యుకేషన్ కోసం సహాయం చేస్తున్న కావ్య, పూర్ణ
Project Shakthi By Kavya And Poorna: పర్వతారోహణ ద్వారా వచ్చిన నిధులతో.. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం సహాయం చేస్తున్న కావ్య, పూర్ణ. ఆడపిల్లల్లో ప్రతిభను గుర్తించడమే ప్రాజెక్ట్ శక్తి లక్ష్యంగా ముందుకెళ్తోంది. బాలికలు, మహిళల సాధికారత కోసం ఈ ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. ఆడపిల్లల అభిృవృద్ధి కోసమే ప్రాజెక్ట్ శక్తి ప్రారంభమయ్యింది. ప్రస్తుతం కావ్య, పూర్ణ కలిసి మౌంట్ ఎలబ్రస్‌ను అధిరోహిస్తున్నారు.
కావ్య మన్యపు
నాసాలో అంతరిక్ష పరిశోధకురాలిగా రాణిస్తోంది కావ్య మన్యపు. ఐఎస్‌ఎస్‌లో మిషన్ ఎవాల్యుయేషన్ రూమ్ మేనేజర్‌గా కూడా కావ్య కొన్నాళ్లు సేవలు చేసింది. ఎంఐటీలో ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది కావ్య. ఆ తర్వాత జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. దాంతో పాటు ఏరోస్పేస్ సైన్సెస్‌లో కూడా పీహెచ్‌డీ చేసింది. కొన్నాళ్లు నార్త్ డకోటా వర్సిటీలో ఏరోస్పేస్ సైన్సెస్ అడ్జంక్ట్ ప్రొఫెసర్‌గా పనిచేసింది కావ్య.
కావ్య ఎక్స్‌ట్రావెహిక్యులర్ యాక్టివిటీ స్పేస్‌వాక్స్, స్పేస్ సూట్స్‌లో నిపుణురాలు అయ్యింది. ప్రస్తుతం తాను అస్ట్రోనాట్ ట్రైనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. నెక్ట్స్ జనరేషన్ స్పేస్‌క్రాఫ్ట్, స్పేస్ సూట్ విభాగంలో కావ్యకు దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. చంద్రుడు, మార్స్‌పై నివాసాల ఏర్పాటుపై తాను పరిశోధనలు చేసింది. సెల్ఫ్ క్లీనింగ్ స్పేస్‌సూట్స్‌పై కూడా ఫోకస్ పెట్టంది కావ్య. కావ్య పరిశోధనలకు ఆరు పేటెంట్స్, 25 ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఉన్నాయి.
2020లో జార్జియా యూనివర్సిటీ నుంచి 40 అండర్ 40 హానరీ అవార్డ్ అందుకుంది. నాసా ఆస్ట్రోనాట్ క్యాండిడెన్సీలో రెండుసార్లు సెమీ ఫైనలిస్ట్‌గా కావ్య నిలిచింది. 14వ ఏటలోనే రాష్ట్రపతి చేతుల మీదుగా బాలాశ్రీ అవార్డ్ అందుకుంది కావ్య మన్యపు. 2013లో బోయింగ్ డిఫెన్స్అండ్ స్పేస్ టాప్ టాలెంట్ అవార్డ్, అమెరికన్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ నుంచి ఉమన్ ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ను కూడా సొంతం చేసుకుంది. తానా నుంచి యూత్ స్టార్ అండ్ యూత్ అచీవ్‌మెంట్ అవార్డ్ తన సొంతమయ్యింది. 2016లో స్పేస్ లీడర్ పురస్కారం, 2014లో స్పేస్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందుకుంది.
పూర్ణ మాలావత్
పర్వతారోహకురాలిగా ఇప్పటికే ప్రతిభ చాటుతున్న అమ్మాయి పూర్ణ మాలావత్. 13 ఏళ్ల వయసులోనే మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన అరుదైన ఘనత తన సొంతం. ప్రపంచంలోనే అతిచిన్న వయసులోనే ఎవరెస్ట్ ఎక్కిన బాలికగా రికార్డ్ కూడా తనదే. నిజామాబాద్ జిల్లా పాకాలలో జన్మించిన పూర్ణకు ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన పర్వతాలు అధిరోహించాలని లక్ష్యం ఉంది. ఇప్పటికే ఏడు ఖండాల్లో ఆరు ఎత్తైన పర్వతాలను అధోరోహించి రికార్డ్ సృష్టించింది పూర్ణ.
2016లో ఆఫ్రికా ఖండంలోని మౌంట్ కిలిమంజారో అధిరోహణ, 2017లో యూరప్ ఖండంలోనే ఎత్తైన మౌంట్ ఎల్బర్స్, 2019లో దక్షిణ అమెరికాలోని మౌంట్ అకోంకాగువా, 2019లో మౌంట్ కార్స్‌టెన్స్ పరిమిడ్‌లను అధిరోహించిన పూర్ణ. త్వరలో ఉత్తర అమెరికాలోని మౌంట్ దెనాలి అధిరోహణ కోసం వెయిట్ చేస్తోంది. పూర్ణ సాధించిన విజయాల ఆధారంగా పూర్ణ పేరుతో సినిమా కూడా తెరకెక్కింది. పూర్ణ లైఫ్ జర్నీపై పుస్తకం కూడా విడుదలయ్యింది.
ప్రపంచంలోని వివిధ సంస్థల నుంచి ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంది పూర్ణ. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా రూబీ జూబ్లీ హెల్త్‌కేర్ అవార్డ్ అందుకుంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ది ఎక్సెలెన్స్ అవార్డ్, ప్రధాని మోదీ చేతుల మీదుగా ది అమేజింగ్ ఇండియన్స్ అవార్డ్‌లను అందుకుంది పూర్ణ.
ఆడపిల్లలకు అండగా ఉండేందుకు కావ్య, పూర్ణ కలిసి ప్రాజెక్ట్ శక్తిని ముందుకు నడిపిస్తున్నారు. నిధులను సేకరించి ఆడపిల్లలను ఆదుకోవాలన్నదే వీరి టార్గెట్. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ప్రాజెక్ట్ శక్తి కృషి చేస్తుంది. ప్రాజెక్ట్ శక్తి ద్వారా డొనేట్ చేయాలనుకునేవారు.. ఈ లింక్ ద్వారా సహాయం చేయగలరు..
https://milaap.org/fundraisers/support-project-shakthi-the-power-of-women