Ladakh : బీజేపీ ఆఫీసుకు నిప్పు పెట్టిన నిరసనకారులు

Update: 2025-09-24 09:16 GMT

లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చడం వంటి డిమాండ్ల కోసం జరుగుతున్న నిరసనలు ఇటీవల హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు మరియు పోలీసులు మధ్య ఘర్షణలు జరిగాయి, ఈ క్రమంలో నిరసనకారులు పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు.

ప్రధానంగా లడఖ్ లోని లేహ్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నిరసనలో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ మరియు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ విధమైన హింసాత్మక ఘటనలు లడఖ్ చరిత్రలో ఇదే మొదటిసారి అని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

లడఖ్ అపెక్స్ బాడీ (LAB) మరియు కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్నాయి. ఈ సంస్థలు లడఖ్‌ను జమ్మూ కాశ్మీర్ నుండి వేరు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినప్పటి నుండి నిరసనలు చేస్తున్నాయి.

Tags:    

Similar News