ISRO : ఆ రెండు సంస్థలకు ఇస్రో రాకెట్ తయారీ కాంట్రాక్టు..
ISRO : ఉపగ్రహ వాహక నౌకల తయారీలో ఇస్రో సరికొత్త విధానం అనుసరిస్తోంది.
ISRO : ఉపగ్రహ వాహక నౌకల తయారీలో ఇస్రో సరికొత్త విధానం అనుసరిస్తోంది. ఇప్పటి వరకు పరిశ్రమల నుంచి వచ్చిన PSLV విడిభాగాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ.. ఈసారి కాంట్రాక్టుకు అప్పగించింది. 860 కోట్ల రూపాయల PSLV తయారీ కాంట్రాక్ట్ ఆఫర్‌ను.. ప్రఖ్యాత సంస్థలు సొంతం చేసుకున్నాయి. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తోపాటు ఎల్ అండ్ టీ కన్సార్టియం దక్కించుకున్నాయి.
ఇస్రో అనుబంధ సంస్థ న్యూస్పేస్ ఇండియా కాంట్రాక్టు కోసం వడపోత అనంతరం దిగ్గజ సంస్థలైన HALతోపాటు ఎల్ అండ్ టీ కన్సార్టియాన్ని ఎంపిక చేసింది. PSLV 5 రాకేట్ల తయారీని ఈ రెండు కంపెనీలు కలిసికట్టుగా చేపట్టనున్నాయి. అయితే పూర్తిస్థాయిలోే PSLV రాకేట్ల తయారీ కాంట్రాక్టుకు ఇవ్వటం ఇస్రో ఇదే తొలిసారి.
అటు కాంట్రాక్టు విషయమై సర్వీస్ లెవల్ ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉందని...న్యూస్పేస్ ఇండియా అధికారులు వెల్లడించారు. రెండేళ్లలోపు తొలి రాకెట్‌ను కన్సార్టియమ్ అందిస్తుందని చెప్పారు. ప్రస్తుతం PSLV తయారీకి ఉపయోగించే 80 శాతం మెకానికల్ వ్యవస్థలు, 60 శాతం ఎలక్ట్రానిక్ పరికరాలు వివిధ పరిశ్రమల నుంచే వస్తున్నాయి.
మిగిలిన శాతం వ్యవస్థలు ఎంతో క్లిష్టమైనవి. ఇకపై HAL, ఎల్ అండ్ టీ కన్సార్టియం PSLV రాకెట్లను తయారుచేసి, బిగించి, ప్రయోగానికి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తాయని న్యూస్పేస్ ఇండియా పేర్కొంది. అటు GSLV మార్క్ 3 ఉపగ్రహ వాహక నౌక తయారీని కూడా పూర్తి స్థాయిలో కాంట్రాక్టుకు ఇచ్చే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ఇస్రో.