Rahul gandhi : రాహుల్ గాంధీ పాదయాత్రకు అద్భుత స్పందన..
Rahul gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది;
Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. కేరళలో రాహుల్ పాదయాత్రకు అద్భుత స్పందన వస్తోంది. పదోరోజు రాత్రి ఏడు గంటలకు చెప్పాడ్‌లో పాదయాత్ర ముగిసింది. అనంతరం హరిపాడ్‌లోని NTPC గ్రౌండ్‌లో రాహుల్‌గాంధీ బస చేసారు.
పదో రోజు ఉదయం ఆరున్నర గంటలకు పుతియకువు జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు రాహుల్. పలు గ్రామాల మీదుగా పాదయాత్రగా వెళ్లిన రాహుల్‌గాంధీ.. ఉదయం పదిన్నర గంటలకు కాయంకులంలో విరామం ఇచ్చారు.
అనంతరం జీడీఎమ్ గార్డెన్స్‌లో స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. మహిళలు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువతతో ముచ్చటిస్తూ.. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ఉత్సాహంగా ముందుకు కదిలారు.
భోజన విరామం తర్వాత ఐదు గంటలకు కాయంకులం జంక్షన్ నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. రాత్రి ఏడు గంటలకు చెప్పాడ్ చేరుకున్న రాహుల్ భారత్ జోడో యాత్ర.. పదోరోజు 25 కిలోమీటర్లు సాగి 175 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది.