Bharat Jodo Yatra : కర్నాటకలో జోరుగా రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'..24 రోజులు పూర్తి..

Bharat Jodo Yatra : భారత్ జోడోయాత్ర 24వ రోజు కర్ణాటక మైసూర్ లోని తాండవపుర వద్ద ముగిసింది

Update: 2022-10-01 14:15 GMT

Bharat Jodo Yatra : భారత్ జోడోయాత్ర 24వ రోజు కర్ణాటక మైసూర్ లోని తాండవపుర వద్ద ముగిసింది. రాహుల్ గాంధీ యాత్ర కర్ణాటకలో జోరుగా సాగుతోంది. రాహుల్ గాంధీ వెంట వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు నడిచారు. తమిళనాడు, కేరళ కంటే ఉత్సాహంగా కర్నాటకలో రాహుల్ యాత్ర జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీకి సవాల్ విసిరే స్థాయిలో కర్నాటక కాంగ్రెస్‌కు బలం ఉండడంతో.. ఆ ఉత్సాహం రాహుల్ పాదయాత్రలో కనిపిస్తోంది. త్వరలోనే కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీని ఓడించే అవకాశం ఉన్న రాష్ట్రం కూడా కర్నాటక కావడంతో.. పాదయాత్రను గ్రాండ్ సక్సెస్ చేసే పనిలో ఉన్నారు కర్నాటక కాంగ్రెస్ నేతలు.

మార్నింగ్‌ సెషన్‌లో 12 కిలోమీటర్ల నడిచిన రాహుల్ సాయంత్రం మరో 13 గంటలు నడిచారు. ఉదయం ఆరున్నరకు గుండ్లుపేట్ తొండవాడి గేట్ నుంచి మొదలైన పాదయాత్ర.. మైసూర్‌లోని తాండవపుర వద్ద ముగిసింది. మార్గమధ్యలో కలాలే గేట్ వద్ద రాహుల్ లంచ్ బ్రేక్ తీసుకున్నారు. విరామ సమయంలో రాహుల్ స్థానిక నేతలు, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇక సాయంత్రం నాలుగున్నరకు కలాలే గేట్ నుంచి తిరిగి పాదయాత్ర మొదలైంది. తాండవపురలోని చిక్కాయనఛత్ర వద్దకు చేరుకోగానే 24వ రోజు యాత్ర ముగిసింది. తాండవపుర వద్ద స్థానిక నేతలు ఏర్పాటు చేసిన బహిరంగసభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఇక రాత్రికి తాండవపురలోని ఎంఐటీ ఎదురుగా రాహుల్‌గాంధీ బస చేయనున్నారు.

ఇదిలా ఉండగా తమిళనాడు, కేరళ కంటే ఉత్సాహంగా కర్నాటకలో రాహుల్ యాత్ర జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీకి సవాల్ విసిరే స్థాయిలో కర్నాటక కాంగ్రెస్‌కు బలం ఉండడంతో.. ఆ ఉత్సాహం రాహుల్ పాదయాత్రలో కనిపిస్తోంది. త్వరలోనే కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీని ఓడించే అవకాశం ఉన్న రాష్ట్రం కూడా కర్నాటక కావడంతో.. పాదయాత్రను గ్రాండ్ సక్సెస్ చేసే పనిలో ఉన్నారు కర్నాటక కాంగ్రెస్ నేతలు.

Tags:    

Similar News