Rahul : గుజరాత్ సర్కారుకు సుప్రీం కోర్టు నోటీసులు

ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యల కేసులో…

Update: 2023-07-21 09:30 GMT

ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ పై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. 2 వారాల్లో సమాధానం చెప్పాలని పిటిషనర్.గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీతోపాటు గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

రాహుల్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది అభిషేక్ సింఘ్వీ..గత 111 రోజులుగా రాహుల్ బాధపడుతున్నారని తెలిపారు. దిగువకోర్టు విధించిన శిక్ష వల్ల ఒకసారి పార్లమెంటు సమావేశాలకు ఆయన హాజరుకాలేకపోయారని, ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. వెంటనే సూరత్ కోర్టు విధించిన శిక్షపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ కేసులో ప్రతివాదుల వాదనలు కూడా వింటామని జస్టిస్ BRగవాయ్ , జస్టిస్ PK మిష్రా ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. ఒక వేళ సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇస్తే రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయి.

2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఈ పరువు నష్టాలను కేసు నమోదయింది. దీనిపై విచారణ చేపట్టిన సూరత్ నిద్రపాలిటీ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తెలితే కనీసం రెండవ శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో సూరత్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్ పై అనర్హత వేటు వేస్తూ లోక్ సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన లోక్సభ సభ్యుత్వం రద్దయింది.

నిజానికి సూరత్ మెట్రోపాలిటీ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే క్రింది కోర్టు ఈ కేసులో శిక్ష విధించడం కరెక్ట్ అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ కారణంతో రాహుల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు

Similar News