కేరళలోని (Kerala) వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిన్న నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్ లో తన నికర సంపద రూ.20కోట్లుగా వెల్లడించారు. రూ.9.24కోట్లు చరాస్తులు, రూ.11.14 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. చరాస్తుల్లో రూ.4.33కోట్లు, బాండ్లుషేర్ల రూపంలో, రూ .3.81 కోట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయని తెలిపారు. తన వద్ద రూ.26.25లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ. 61.52లక్షల విలువ చేసే నేషనల్ సేవింగ్స్ స్కీమ్, పోస్టల్ సేవింగ్స్, బీమా పాలసీలు, రూ.15.21లక్షల విలువైన గోల్డ్ బాండ్లు, రూ.4.20లక్షల విలువైన ఆభర ణాలు, రూ.55వేల నగదు ఉన్నట్లు వెల్లడించా రు. రూ.2022-23లో తన వార్షికాదాయం రూ.కోటిగా ప్రకటించారు. స్థిరాస్తుల్లో భాగంగా ఢిల్లీలోని మెహౌలీలో 2.346 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలిపారు. ఇందులో సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు కూడా వాటాలున్నట్టు పేర్కొన్నారు. ఇది తమకు వారస త్వంగా దక్కిన ఆస్తిగా తెలిపారు. ఇక గురుగ్రా మ్లో రూ.9కోట్ల విలువ చేసే ఆఫీస్ ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.49.7లక్షల రుణాలు కూడా ఉన్నాయని ప్రకటించారు. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీపై సీపీఐ తరఫున అనీ రాజా పోటీ చేస్తున్నారు.