Rahul Gandhi : వయనాడ్ కు రాహుల్ గాంధీ గుడ్ బై!

Update: 2024-06-13 09:10 GMT

ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో రెండుచోట్ల గెలుపొందిన రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) తప్పనిసరిగా ఒక చోటు రాజీనామా చేయాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ, కేరళలోని వయనాడ్ పార్లమెంటు సీట్లలో నుంచి ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంపై ఎటూ తేల్చుకోలేక పోతున్నారు.

ఏ స్థానాన్ని వదులుకోవాలన్న అంశంపై సతమతమవుతున్నారు. వరుసగా రెండుసార్లు పట్టం కట్టిన వయనాడు వదులుకోవాలా, లేదా దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటలా ఉన్న రాయ్ బరేలీని వదులుకోవాలా అన్న అంశం ఇప్పుడు రాహుల్ ను ఇబ్బంది పెడుతోంది. దీనిపై రాహుల్ కూడా ఒక స్పష్టతకు రాలేకపోతున్నారు. రాహుల్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

రాహుల్ వయనాడ్ వదులుకుంటారని సంకేతాలిస్తూ కేరళ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వయనాడ్ లోక్ సభ స్థానాన్ని వదులుకునే అవకాశం ఉందని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సుధాకరన్ సూచన ప్రాయంగా వెల్లడించారు. రాహుల్ ప్రాతినిధ్యం వయనాడ్ లో లేకపోయినప్పటికీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని.. ప్రతి ఒక్కరూ రాహుల్ నిర్ణయాన్ని అర్థం చేసుకుని, అగ్రనేతకు మద్దతు ఇవ్వాలని కోరారు.

Tags:    

Similar News