Rahul Gandhi: రాహుల్ మణిపూర్ పర్యటన ఉద్రిక్తం
శాంతిభద్రతల సమస్యను కారణంగా చూపుతూ రాహుల్ కాన్వాయ్‌ను ఆపేశారు.;
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది షెడ్యూల్ ప్రకారం చురాచాంద్‌పూర్‌కు బయలుదేరిన రాహుల్‌ను బిష్ణుపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్యను కారణంగా చూపుతూ రాహుల్ కాన్వాయ్‌ను ఆపేశారు.అదే సమయంలో రాహుల్ గాంధీ కాన్వాయ్‌పై కొంత మంది ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పర్యటనకు అనుమతివ్వలేమంటూని రాహుల్‌ను వెనక్కి పంపారు పోలీసులు.బాధితులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. మణిపూర్ అంశంలో బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది.మరోవైపు పోలీసుల ఆదేశాలతో హెలికాప్టర్‌లో ఇంఫాల్‌కు చేరుకున్నారు రాహుల్. అక్కడ సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలతో మాట్లాడారు. వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.