Rakesh Tikait: టీఆర్ఎస్ ఎంపీలతో రాకేష్ తికాయత్.. 'రైతన్న' సినిమా చూస్తూ..
Rakesh Tikait: భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్, టీఆర్ఎస్ ఎంపీలు ‘రైతన్న’ సినిమా వీక్షించారు.;
Rakesh Tikait: దేశంలో రైతు సమస్యలపై ఆర్.నారాయణ మూర్తి నిర్మించిన రైతన్న సినిమాను.. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్, టీఆర్ఎస్ ఎంపీలు కేశవ రావు, నామా నాగేశ్వర రావు, రంజిత్ వీక్షించారు. దేశంలోని రైతులు, వ్యవసాయ రంగ వాస్తవ పరిస్థితులకు సినిమా అద్దం పట్టిందన్నారు రాకేష్ తికాయత్. రైతులు సంఘటితంగా పోరాడితే సమస్యల పరిష్కారం సాధ్య అవుతుందన్నారు.
రైతన్న సినిమా తీసినందుకు నారాయణమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. కనీస మద్ధతు ధర సహా కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. దేశంలో రైతులు గిట్టుబాటు ధర సహా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు. రైతుల సమస్యలను నారాయణ మూర్తి బాగ చూపించారని ప్రశంసించారు.రైతుల కష్టాలను నారాయణ మూర్తి కళ్లకు కట్టారన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు.