అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండగను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిజేస్తున్నారు పలువురు ప్రముఖులు. "ఈ ప్రత్యేకమైన రాఖీ పండుగ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. . కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, "సోదర సోదరీమణుల మధ్య ఉండే విడదీయరాని ప్రేమ, విశ్వాసం, రక్షణ అనే బంధానికి అంకితమైన పవిత్రమైన పండుగ 'రక్షాబంధన్' సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని తెలిపారు. మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా 'ఎక్స్' ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేశారు. "రక్షాబంధన్ పండుగ సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, నిబద్ధతకు చిహ్నం. ఈ పవిత్ర పండుగ సందర్భంగా దేశప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని ఆయన అన్నారు.