Rameshwaram Cafe Blast: ఎన్‌ఐఏ అదుపులో బీజేపీ కార్యకర్త
రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్;
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటన దర్యాప్తులో మరో ముందడుగు పడింది. ఈ కేసులో ఇద్దరు అనుమానితులతో సంబంధాలున్న బీజేపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. కేసు దర్యాప్తులో భాగంగా గత వారం శివమొగ్గలో ఎన్‌ఐఏ దాడులు జరిపింది. ఓ మొబైల్ స్టోర్‌తో సహా ఇద్దరు అనుమానితుల ఇండ్లలో సోదాలు జరిపింది. మొబైల్ స్టోర్ ఉద్యోగులను విచారించగా బీజేపీ కార్యకర్త సాయిప్రసాద్ పేరు బయటకు వచ్చిందని ఎన్‌ఐఏ వర్గాలు శుక్రవారం తెలిపాయి.
బీజేపీ కార్యకర్త అరెస్ట్ కావటంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ నాయకుడు దినేశ్ గుండూరావు ఎక్స్ వేదికగా బీజేపీని నిలదీశారు. మీ పార్టీ కార్యకర్త అరెస్ట్‌పై మీరేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. పేలుళ్లలో బీజేపీ ప్రమేయం ఉన్నట్టు అర్థమవుతున్నదని ఆయన అన్నారు. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడులో పది మంది గాయపడ్డారు.
బీజేపీ కార్యకర్త సాయి ప్రసాద్ ను ఎన్ఐఏ అధికారులు రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారని సమాచారం. గతవారం తీర్థహళ్లిలోని ఇద్దరు ముస్లిం యువకుల ఇల్లు, మొబైల్ షాపుపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహించారు. తరువాత ఆ ఇద్దరు ముస్లీం యువకులను విచారణ చేసిన ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారం సేకరించారని తెలిసింది. బీజేపీ కార్యకర్త సాయి ప్రసాద్ ఆ ఇద్దరు ముస్లిం యువకులతో నిత్యం టచ్ లో ఉన్నాడని తేలింది. కేజీఎఫ్ హీరో యష్ ఎందుకు దూరంగా ఉంటున్నారో తేలిపోయింది, ఆ రోజు మోదీని కలిసినా ! AD దీనికి సంబంధించి కొన్ని రోజుల క్రితం తీర్థహళ్లిలోని పలు ఇళ్లు, దుకాణాలపై ఎన్‌ఐఏ సైలెంట్ గా దాడులు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు తీర్థహళ్లిలో బీజేపీ కార్యకర్త సాయి ప్రసాద్ ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. మరింత సమాచారం కోసం వేచి ఉండాలని సంబంధిత అధికారులు అంటున్నారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతోంది.
ముఖ్యంగా ఎన్‌ఐఏ సైలెంట్‌గా విచారణ ప్రారంభించి నిందితుల ఆచూకీ కోసం పని చేస్తోంది. రామేశ్వరం కేఫ్ కేసులో నిందితులు అందరిని అరెస్ట్ చేయడమే ఎన్ఐఏ లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి సెంట్రల్ జైలులో ఉన్న బళ్లారి వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేసిన ఎన్ఐఏ అధికారులు అతన్ని విచారణ చేసి వివరాలు సేకరించారు.