రతన్ టాటా బెస్ట్ ఫ్రెండ్ మన తెలుగోడే. టాటాకి కుడి భుజం అతనే. రతన్ టాటాకు అత్యంత ఆప్తుడంటే పెద్ద వయస్సు ఉన్న వ్యక్తి అనుకుంటే పొరపాటే. టాటా వయస్సు లో సగం కూడా ఉండదు అతని వయస్సు. టాటా బెస్ట్ ఫ్రెండ్ పేరు శంతను నాయుడు. అతని వయస్సు కేవలం 31 ఏళ్లు మాత్రమే. శంతను నాయుడు..టాటాకు అత్యంత సన్నిహితుడు మాత్రమే కాదు సహాయకుడిగా పేరు పొందిన వ్యక్తి. శంతను నాయుడికి ఉన్న కొన్ని ప్రత్యేక క్వాలిటీస్ కారణంగా ఆయన రతన్ టాటా లాంటి గొప్ప వ్యక్తికి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు.
రెండేళ్ల క్రితం రతన్ టాటా తన 84వ జన్మదిన వేడులకను అత్యంత సాధారణంగా జరుపుకున్న వీడియో దేశవ్యాప్తంగా చాలామంది దృష్టిని ఆకర్షించింది. వేల కోట్ల ఆస్తులున్న కేవలం ఒక కప్ కేక్ తో పుట్టినరోజుని జరుపుకున్నారు టాటా. ఈ సెలబ్రేషన్ లో రతన్ టాటాకి కేక్ తినిపిస్తూ ఓ టీనేజ్ కుర్రాడు కనిపించాడు. అయితే టాటాతో చాలా క్లోజ్ గా ఉన్న ఆ కుర్రాడు ఎవరు అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అతడే టాటా బెస్ట్ శంతన్ నాయుడు.
1993లో పూణేలోని తెలుగు కుటుంబంలో జన్మించాడు శంతను నాయుడు. సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. టాటా గ్రూప్ లో డిజైన్ ఇంజినీరుగా ఉద్యోగం చేసే శంతన్ నాయుడు ఓ రోజు ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు మధ్యలో చనిపోయి పడి ఉన్న వీధికుక్క మీదన వాహనాలు వెళ్తుండటాన్ని గమనించాడు. ఇది చూసి శంతను చలించిపోయాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ తో కలిసి వీధి కుక్కల కోసం రేడియం కాలర్స్ ని తయారు చేశాడు. తన ఆఫీసుకి వెళ్లే దారిలో కనిపించిన కుక్కలను వాటికి అమర్చాడు. ముంబైలోని వీధికుక్కలన్నింటికి సహాయం చేయాలని అనుకున్నాడు. ..రోడ్డు ప్రమాదాల్లో వీధి కుక్కల ప్రాణాలు పోకుండా సహాయం చేసేందుకు మోటోపౌస్ అనే పేరుతో ఒక సంస్థను సృష్టించాడు. అయితే తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తండ్రి సూచనతో రతన్ టాటాకు సాయం చేయాలని మెయిల్ పెట్టాడు. అయితే ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. అయితే రెండు నెలల తర్వాత రతన్ టాటా నుంచి శంతను నాయుడికి ఆహ్వానం వచ్చింది. శంతను నాయుడు ఆలోచన జంతు ప్రేమికుడు కూడా అయిన రతన్ టాటా దృష్టిని ఆకర్షించింది. వీధికుక్కల పట్ల అతను చూపిన ప్రేమకు ఫిదా అయిన రతన్ టాటా శంతనుని ముంబైకి పిలిచాడు. అక్కడ నుండి ఇద్దరి మధ్య లోతైన స్నేహం ప్రారంభమైంది. ఇద్దరి మధ్య ఉమ్మడి ఆలోచనలు, సామాజిక సమస్యలపై చర్చ ఈ సంబంధాన్ని మరింత బలోపేతం చేసింది.
అయితే టాటాతో ఫ్రెండ్ అయిన కార్నెల్ యూనివర్శిటీలో ఎంబీఏ సీటు రావడంతో అమెరికా వెళ్లాడు శంతను నాయుడు. ఎంబీఏ పూర్తి అయ్యాక టాటా గ్రూప్ లోనే పనిచేయాలని శంతన్ ని రతన్ టాటా కోరారు. ఆయన కోరిక మేరకు శంతన్ ఎంబీ కంప్లీట్ అయ్యాక టాటా ట్రస్టులో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా చేరాడు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు తనకు పని ఒత్తిడి ఎక్కువగా ఉందని,తనకు వ్యక్తిగత సహాయుడిగా ఉండాలని శంతన్ ని రతన్ టాటా కోరాడు. అలా 2018 నుంచి రతన్ టాటాకి నీడలా వెన్నంటి ఉన్నాడు శంతన్ నాయుడు.
రతన్ టాటాతో తనకున్న స్నేహం గురించి శంతను నాయుడు తన ఐ కేమ్ అపాన్ ఎ లైట్‌హౌస్ బుక్ లో వివరంగా రాశారు. ఈ పుస్తకంలో అతను విజయవంతమైన వ్యాపారవేత్తగా ప్రపంచానికి తెలిసిన టాటాను విభిన్న కోణంలో అందించాడు. టాటా,నాయుడు మధ్య విలువైన క్షణాలు పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి.
శాంతను ఇప్పుడు రతన్ టాటా కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కొత్త స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టడంపై టాటా గ్రూప్‌కు సలహాలు కూడా ఇస్తున్నారు.