రతన్ టాటా ఎన్నో రంగాల్లో అడుగుపెట్టినట్టు సినిమా రంగంలో కూడా అడుగుపెట్టారు. సినిమాలకు ప్రోడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. అయితే అన్ని రంగాల్లో సక్సెస్ అయినట్టు సినిమా రంగంలో మాత్రం టాటా విజయం సాధించలేరు. రతన్ టాటా ఒక్క సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. అప్పటి నుంచి మరోసారి ఇండస్ట్రీ వైపు చూపలేదు..
ఇంతకీ రతన్ టాటా ప్రొడ్యూస్ చేసిన సినిమా ఏదని ఆలోచిస్తున్నారా..2004లో రిలీజ్ అయిన 'ఏత్‌బార్' సినిమాని బాలీవుడ్ నిర్మాత జితిన్ కుమార్‌తో కలిసి రతన్ టాటా నిర్మించారు. ఈసినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రధాన పాత్రల్లో నటించారు. 1996లో తెరకెక్కిన హాలీవుడ్ సినిమా 'ఫియర్' స్ఫూర్తితో విక్రమ్ భట్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.