ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా నిన్న బుధవారం అక్టోబర్ 9 అర్ధరాత్రి కన్నుమూశారు. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆయన తుది శ్వాస విడిచారు. బుధవారం ఉదయం నుంచి ఆయనకు ఐసీయూలో చికిత్స అందించినట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
రతన్ టాటా అస్వస్థతకు గురై ఓ ఆస్పత్రిలో చేరారంటూ సోమవారం వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు వెలువడింది. తాను బాగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని పోస్టులో అందులో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం మరోసారి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వచ్చాయి. రతన్ టాటా మృతిని ధ్రువీకరిస్తూ టాటా గ్రూప్, పోలీసు వ్యవస్థ అధికారికంగా అర్ధరాత్రి ప్రకటన చేశాయి. దీంతో దేశమంతా రతన్ టాటాకు నివాళులు అర్పిస్తోంది.