పేద ప్రజలకు ఉచిత రేషన్ అందించే పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేదిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2024 జనవరి 1 నుంచి ఐదేళ్లపాటు ఈ పథకం కింద ఉచితంగా ఆహారధాన్యాలు అందిస్తూ వస్తోంది. అయితే, ఈ పథకం పక్కదారి పడుతోందని లబ్ధిదారుల్లో చాలా మంది అనర్హులు ఉన్నారని కేంద్రానికి నివేదికలు అందాయి. అనర్హుల ఏరివేతకు మోడీ ప్రభుత్వం చర్యలకు తీసుకోబోతోంది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. డేటా కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు లేఖ రాసింది. ఐటీ విభాగం కూడా పన్ను చెల్లింపు దారుల వివరాలను ఆహారమంత్రిత్వ శాఖతో పంచుకోనుంది. ఆధార్, పాన్, సేవింగ్స్ వివరాలను సమర్పిస్తే, నిర్ణీత మొత్తంకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారి డేటాతో ఏరివేత పూర్తి చేయనుంది.