భారత క్రికెటర్ రవీంద్ర జడేజా బీజేపీలో చేరారు. ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్న విషయాన్ని జడేజా సతీమణి రివాబా జడేజా వెల్లడించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జడేజా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఆల్‌రౌండర్ ఇటీవల టీ20I క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా పార్టీలో చేరడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారనే చర్చ మొదలైంది. రివాబా ఇప్పటికే గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, రవీంద్ర జడేజా ఇప్పటివరకు 72 టెస్టుల్లో 3,036 పరుగులు, 294 వికెట్లు సాధించాడు. వన్డేల్లో 197 మ్యాచ్‌లు ఆడి, 2,756 పరుగులు, 220 వికెట్లు తీశారు. టీ20ల్లో అతను 74 మ్యాచ్‌లలో 515 పరుగులు, 54 వికెట్లు పడగొట్టారు.