ఆర్‌బిఐ ప్రకటన.. త్వరలో కొత్త 100, 200 రూపాయల నోట్లు.. మరి పాత నోట్ల పరిస్థితి
ఆర్‌బిఐ డేటా ఆధారంగా మార్చి 2017లో నగదు ప్రసరణ రూ. 13.35 లక్షల కోట్లు ఉండగా, మార్చి 2024 నాటికి అది రూ. 35.15 లక్షల కోట్లకు పెరిగింది.;
ఆర్‌బిఐ డేటా ఆధారంగా మార్చి 2017లో నగదు ప్రసరణ రూ. 13.35 లక్షల కోట్లు ఉండగా, మార్చి 2024 నాటికి అది రూ. 35.15 లక్షల కోట్లకు పెరిగింది.
100, 200 రూపాయల నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక పెద్ద ప్రకటన చేసింది. త్వరలో రూ. 100 మరియు రూ. 200 కొత్త నోట్లను విడుదల చేయబోతోంది, కానీ వాటి డిజైన్‌లో ఎటువంటి మార్పు ఉండదని పాత నోటు మాదిరిగానే ఉంటుందని తెలిపింది. అయితే ఈ కొత్త నోట్లపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని ఆర్‌బిఐ తెలియజేసింది. కొత్త గవర్నర్ నియామకం జరిగిన ప్రతిసారి వారి సంతకంతో కూడిన నోట్లు జారీ చేయబడే సాధారణ ప్రక్రియ ఇది అని ఆర్బీఐ స్పష్టం చేసింది.
పాత నోట్లు చెలామణిలో ఉండవా..
పాత 100, 200 రూపాయల నోట్లు చెల్లుబాటులో ఉంటాయని, వాటిని మార్చబోమని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. ఈ కొత్త నోట్లు త్వరలో బ్యాంకులు మరియు ఏటీఎంలలో లభిస్తాయని ఆర్‌బీఐ తెలిపింది. అయినా ఇప్పుడు అంతా డిజిటల్ చెల్లింపులు. నగదు మార్పిడి తగ్గిపోయింది.
భారతదేశంలో ఎంత నగదు ఉపయోగించబడుతుంది?
కానీ నివేదికల ప్రకారం, రూ.2,000 నోట్లను నిషేధించినప్పటికీ, దేశంలో నగదు చలామణి గతంలో కంటే ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది. ఆర్‌బిఐ డేటాను పరిశీలిస్తే, మార్చి 2017లో నగదు ప్రసరణ రూ. 13.35 లక్షల కోట్లు ఉండగా, మార్చి 2024 నాటికి అది రూ. 35.15 లక్షల కోట్లకు పెరిగింది. UPI ద్వారా డిజిటల్ లావాదేవీలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. మార్చి 2020లో UPI లావాదేవీ 2.06 లక్షల కోట్లు కాగా, ఫిబ్రవరి 2024 నాటికి అది 18.07 లక్షల కోట్లకు పెరిగింది. అయితే, 2024 సంవత్సరం గురించి మాట్లాడుకుంటే, ఈ సంవత్సరం డిజిటల్ లావాదేవీలు దాదాపు 172 బిలియన్లు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.
ఏ రాష్ట్రాల్లో ATM ల నుండి ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేయబడుతుంది?
నివేదికల ప్రకారం, 2024లో ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు కర్ణాటక అత్యధికంగా ఎటిఎం నుండి నగదు ఉపసంహరణలు జరిగాయి. నిజానికి, పండుగలు, ఎన్నికల సమయంలో నగదుకు డిమాండ్ పెరుగుతుంది. అంతేకాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులు పరిమితంగా ఉండటం వల్ల ఇక్కడి ప్రజలు నగదును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.