RBI Deputy Governor : ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రవిశంకర్ పదవీకాలం పొడిగింపు
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు ఆర్బీఐ సిఫార్సు లను నియామకాలపై కేబినెట్ కమిటీ (ఏసీసీ) ఆమోదించింది. వ్యక్తిగత శిక్షణ విభాగం అధికారిక ఉత్తర్వు ప్రకారం, పొడిగించిన పదవీకాలం 2025 మే 3 నుంచి అమల్లోకి వర్తిస్తుంది. ప్రస్తుతం రవిశంకర్ ఆర్బీఐలో ఫిల్టిక్ డిపార్టుమెంట్ లో కీలక పోర్ట్ పోలియోల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఫైనాన్షియల్ మార్కెట్ ఆపరేషన్స్ విభాగం, ఫైనాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేషన్ విభాగం బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్నారు. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణలో రవిశంకర్ ముఖ్య భూమిక పోషిం చారు. డిప్యూటీ గవర్నర్ బాధ్యతలకు ముందు ఈయన ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా తన పనితీరుతో గుర్తింపు పొందారు.