RBI Key Changes : యూపీఐ చెల్లింపుల్లో ఆర్బీఐ కీలక మార్పులు

Update: 2024-12-28 13:15 GMT

యూపీఐ చెల్లింపుల విధానంలో ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (పీపీఐ)లను అందిస్తున్న సంస్థల వాలెట్లలో ఉన్న నగదును ఇకపై థర్డ్ పార్టీ మొబైల్ అప్లికేషన్లను వినియోగించి చెల్లింపులు, నగదు స్వీకరణ చేసుకునే వెసులుబాటును కల్పించింది. దీనిపై ఆర్బీఐ శుక్రవారం నాడు సర్క్యులర్ ను విడుదల చేసింది. కేవైసీ పూర్తి చేసిన పీపీఐ యూజర్ ఇకపై థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల్లో (పీపీఐ) ముందుగానే కొంత డబ్బును జమ చేసి పెట్టుకోవచ్చు. వీటిని వాలెట్లు, లేదా ప్రీ పెయిడ్ కార్డులుగా భావిస్తారు. వీటి ద్వారా యూపీఐ, ఆన్లైన్ లావాదేవీలకు చెల్లింపులు చేయవచ్చు. పీపీఐలో ఉన్న డబ్బు మేరకు బ్యాంక్ ఖాతాతో సంబంధం లేకుండా వీటిని చెల్లించవచ్చు. ఇప్పటి వరకు పీపీఐ అందిస్తున్న సంస్థకు చెందిన యూపీఐ ద్వారానే చెల్లింపులు చేసే వీలుకలుగుతుంది. దీన్ని ఆర్బీఐ మార్చింది. ఇక నుంచి పీపీఐలకు ఏదైనా యూపీఐ అప్లికేషన్ ను అనుసంధానం చేసి చెల్లింపులు చేసుకోవచ్చు. వాలెట్, యూపీఐ యాప్ వేర్వేరు కంపెనీలకు చెందినవి అయినప్పటికీ వినియోగదారులు తమ వాలెట్లో దేనినైనా యూపీఐ యూప్లతో అనుసంధానం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ముఖ్యంగా గిఫ్ట్ కార్డులు, మెట్రో రైలు కార్డులు, డిజిటల్ వాలెట్లను వినియోగించే పీపీఐ యూజర్లకు మరింత వెసులుబాటు కలుగుతుంది.

Tags:    

Similar News