Amit Shah : జమిలి బిల్లును జేపీసీకి పంపేందుకు సిద్ధం : అమిత్ షా

Update: 2024-12-17 11:30 GMT

ప్రతిపక్షాల వినతి మేరకు జమిలి బిల్లును జేపీసీకి పంపేందుకు తాము సిద్ధమని కేంద్రమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రకటించారు. క్యాబినెట్ భేటీలోనూ ప్రధాని మోదీ ఇదే విషయాన్ని తమకు స్పష్టం చేశారని చెప్పారు. ఈమేరకు ఆయన న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్‌కు సూచన చేశారు. మరోవైపు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే తదితర పార్టీల ఎంపీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దేశ పురోగతి కోసమే లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టినట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ‘ఐదేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. గతంలోనూ ఏకకాలంలో ఎన్నికలు జరిగేవి. ఎన్నికల కమిషన్, న్యాయ కమిషన్ సూచనల మేరకే బిల్లును తీసుకొచ్చాం. దేశ ప్రయోజనాల కోసం తీసుకొచ్చాం. సభ్యుల వద్ద సలహాలు ఉంటే ఇవ్వొచ్చు. అయితే వ్యతిరేకించడం సరికాదు’ అని అన్నారు.

Tags:    

Similar News