దేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా టాప్ 9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 4,06,889 యూనిట్లుగా నమోద య్యాయి. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో పోల్చితే ఇళ్ల అమ్మ కాలు ఈ నగరాల్లో 33 శాతం పెరిగాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంగ్ సంసప్రాప్ ఈక్విటీ తెలిపింది. గడిచిన మూడు ఆర్ధిక సంవత్సరా ల్లో మొత్తం 10 లక్షల ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు తెలిపింది. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూర్, చెన్నయ్, కోల్కతా, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, థానే, నమీ ముంబై, పుణే నగరాలపై ప్రాస్ఈక్విటీ నివేదిక ఇళ్ల అమ్మకాల వివరాలను తెలిపింది.
సంవత్సరం మొత్తంగా చూస్తే ఒక్క ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో మాత్రమే ఇళ్ల అమ్మకాలు 8 శాతం తగ్గాయి. మిగిలిన 8 నగరాల్లో అమ్మకాలు 22 నుంచి 88 శాతం వరకు పెరిగాయి. కోల్కతాలో అత్యధికంగా 88 శాతం, ముంబైలో 22 శాతం అమ్మకాలు పెరిగాయి. ప్రధానంగా ఈ నగరాల్లో 2018-19 సంవత్సరంలో నిర్మాణాలు ప్రారంభించిన ఇళ్లు పూర్తి కావడంతో పెరుగుదల నమోదైందిన పేర్కొంది.
ముంబై, నవీ ముంబై, థానే, పూణే నగరాల్లో మొత్తం ఇళ్ల అమ్మకాల్లో 55 శాతం వాటా కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది. హైద రాబాద్, బెంగళూర్, చెన్నయ్ నగరాల్లో మొత్తం ఇళ్ల అమ్మ కాల్లో 30 శాతం ఉన్నాయని తెలిపింది. కోల్కతా నగరం వాటా 4 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఇళ్ల అమ్మకాలు 16-11 శాతానికి తగ్గాయని తెలిపింది.
హైదరాబాద్ లో అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల అమ్మకాలు 61 శాతం పెరిగి 57,304 యూనిట్లుగా నమోదయ్యాయి. ప నాణేలో 41 శాతం పెరిగి 81,563 యూనిట్లుగా, థానేలో 39. శాతం పెరిగి 77,017 యూనిట్లు, 26 శాతం వృద్ధితో బెంగళూర్లో 46,103 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యా యి. ఢిల్లీ ఎన్సీఆర్లో 8 శాతం తగ్గి 44,423 యూనిట్లు, ముంబైలో 22 శాతం పెరిగి 41,999 యూనిట్లు, నవీ ముంబైలో 37 శాతం పెరిగి 21,112 యూనిట్లు, చెన్నయ్లో 49 శాతం పెరిగి 19,650 యూనిట్లు, కోల్ కతాలో 88 శాతం అమ్మకాలు పెరిగి 17,718 యూనిట్లుగా నమోదైనట్లు ప్రాప్ ఈక్విటీ తెలిపింది.