భారత్- పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమృత్ సర్ లో రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ఇవాళ ఉదయం 6 గంటలకు గ్రీన్ అలర్ట్ జారీ చేసిన కొద్దిసేపటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. వైమానిక దాడి హెచ్చ రిక సైరన్లు మోగాయి. దీంతో పెద్ద ఎత్తున భద్రతాదళాలు మోహరించాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొవడానికి అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ సంఖ్యలో మిలిటరీ మోహరించింది. పౌరులను అలర్ట్ చేస్తున్నా రు. ప్రజలెవరూ ఇళ్లనుంచి బయటకు రావొ ద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ తెల్లవారుజామున భారత్ పాకిస్తాన్లో ని నాలుగు వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. దానికి ప్రతీగా పాకిస్థాన్ ఢిల్లీ వైపు ఫతా2 క్షిపణిని ప్రయోగించింది. అయితే దీన్ని గుర్తించిన భారత్ సైన్యం సిర్సాలో అడ్డ గించి కూల్చివేసింది.