Potato Smuggling పుష్ప సినిమా స్టైల్లో బంగాళాదుంపల స్మగ్లింగ్..

పశ్చిమ బెంగాల్‌లో ఘటన;

Update: 2024-12-08 01:00 GMT

పశ్చిమ బెంగాల్లో బంగాళదుంపల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో బంగాళాదుంపల ధరలను నియంత్రించడానికి అక్కడి సీఎం మమతా బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు బంగాళాదుంపల ఎగుమతి నిషేధించారు. అయినప్పటికీ పలువురు మాత్రం బంగాళదుంపలను స్మగ్లింగ్ చేస్తూ దందా నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పలు ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ఇతర రాష్ట్రాలకు బంగాళాదుంపలను సరఫరా చేసే ప్రయత్నాన్ని నిలిపివేస్తున్నారు. అలాంటి ట్రక్కులను తిరిగి ఆ రాష్ట్రానికి పంపుతున్నారు.

పోలీసులకు తెలియడంతో

కొంత మంది మాత్రం పుష్ప సినిమా స్టైల్లో బంగాళదుంపలను స్మగ్లింగ్ చేస్తున్నారు. అది కాస్తా పోలీసులకు తెలియడంతో అడ్డంగా దొరికిపోయారు. పశుగ్రాసం కోసం ఇన్‌వాయిస్ తీసుకుని వాటిలో బంగాళాదుంపలను అక్రమంగా తరలిస్తున్నారు. ఆ చలాన్లతో లారీలను రహస్యంగా వేరే రాష్ట్రానికి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. పోలీసులు వారిని గుర్తించి పట్టుకున్నారు. ఇంకొంత మంది కూడా చాలా ట్రక్కులకు నకిలీ ఇన్‌వాయిస్‌లు వేసి బంగాళాదుంపలను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించారు. ఇలా చాలా లారీలను పట్టుకుని పశ్చిమ బెంగాల్ వైపు మళ్లించారు.

డ్రైవర్లు ఏం చెప్పారంటే..

పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దులోని డబుర్దిహ్ చెక్‌పోస్టు పార్కింగ్ సమీపంలో ఓ ట్రక్ డ్రైవర్ తాము మట్టిని లోడ్ చేయాలనుకుంటున్నామని పేర్కొ్న్నాడు. కానీ మా ఓనర్ మాత్రం మమ్మల్ని బంగాళాదుంపలను లోడ్ చేయమని బలవంతం చేశాడని వెల్లడించారు. చలాన్ గురించి మాకు ఏం చెప్పలేదన్నారు. ఈ క్రమంలో లారీలను పట్టుకున్న పోలీసులు బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రానికి ఏ విధంగానూ బంగాళదుంపలు తీసుకెళ్లకూడదని పేర్కొన్నారు. ఈ దందా ఎక్కువైన క్రమంలో బంగాళాదుంపల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 20 ట్రక్కుల నిండా బంగాళాదుంపలను వెనక్కి పంపించారు.

అనుమానం వచ్చి..

ఇదే సమయంలో కొంత మంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నకిలీ చలాన్ల ద్వారా బంగాళదుంపలు లోడ్ చేసిన ట్రక్కులను రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాత్రి సమయాల్లో గత కొన్ని రోజులుగా బంగాళాదుంపలతో కూడిన అనేక ట్రక్కులను రాష్ట్రం నుంచి పంపిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో అదుపులోకి తీసుకున్న ట్రక్ డ్రైవర్ల నుంచి ముఠా గురించి సమాచారం తెలుసుకుంటున్నారు. దీంతోపాటు అనుమానం వచ్చిన లారీల టార్పాలిన్‌ కూడా తీసి పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News