గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.30.50 తగ్గించడంతో ఢిల్లీలో దీని ధర రూ.1764.50గా ఉంది. అలాగే 5కేజీల FTL సిలిండర్ ధర కూడా రూ.7.50 తగ్గింది. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి.
గత కొన్నాళ్లుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇంట్లోని వంటగ్యాస్ ధరలు తగ్గిస్తున్నా, కమర్షియల్ సిలిండర్ ధరలను మాత్రం పెంచుకుంటూ పోయాయి చమురు సంస్థలు. వాణిజ్య సిలిండర్లను బయట షాపుల్లో వినియోగిస్తారు. కాబట్టి హోటల్స్‌లో, ఫుడ్ కోర్టుల్లో తయారు చేసే ఆహార పదార్థాల ధరలు స్వల్పంగా తగ్గే ఛాన్స్ ఉంది.
అటు గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధరపై కేంద్ర ప్రభుత్వం రూ.100 తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ సిలిండర్ ధర రూ.903గా ఉంది.