Rekha Gupta : నేను సీఎం అవుతానని నాకే తెలియదు.. రేఖా గుప్తా ఆసక్తికర కామెంట్స్

Update: 2025-02-21 11:00 GMT

బుధవారం ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి బయల్దేరే సమయానికి ముఖ్యమంత్రి అవుతానని తనకు తెలియదని ఢిల్లీ కొత్త సీఎం రేఖాగుప్తా అన్నారు. "48 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా జేపీ శాసనసభాపక్ష సమావేశానికి వెళ్లాను. కానీ పర్వేశ్ వర్మ నా పేరు ప్రతిపాదించిన తర్వాతే తెలిసింది. అలాగే అన్నికల హామీ మేరకు మార్చి ఎనిమిదిన ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 అందజేస్తాం. ప్రధాని మోడీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. శీశ్ మహల్ ను మ్యూజియంగా మారుస్తామని రేఖా గుప్తా చెప్పారు. ఢిల్లీకి తొమ్మిదో సీఎంగా, నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా రికార్డుకెక్కారు. అంతకుముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిశీ ఢిల్లీ మహిళా సీఎంలుగా సేవలందించారు. అలాగే బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేల్ తర్వాత సీఎం బాధ్యతలు చేపట్టిన ఐదో మహిళగా రేఖాగుప్తా నిలిచారు.

Tags:    

Similar News