ఎలాంటి మార్పుల్లేవ్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడి ముంబై: వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచు తున్నట్లు స్పష్టం చేసింది. వరుసగా 11వ సారి కూడా రెపో రేటును 6.5 శాతంగానే ఫిక్స్ చేసింది. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ ఇవాళ వెల్లడించారు. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా వడ్డీరేట్లలో మార్పులు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈసారి స్థిరవి ధాన వైఖరిని కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వ సారి కావడం గమనార్హం.