Missing : కుంభమేళాలో జగిత్యాల వాసులు మిస్సింగ్

Update: 2025-01-31 14:00 GMT

మహా కుంభమేళాకు వెళ్లిన జగిత్యాలకు చెందిన నలుగురు తప్పిపోయారు. ఇటీవలే ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాకు జగిత్యాల నుంచి పలువురు వెళ్లారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మిస్సింగ్‌ అయినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తప్పిపోయిన వారిలో విద్యానగర్‌కు చెందిన నరసవ్వ, కొత్తవాడకు చెందిన రాజవ్వ, నిర్మల్ జిల్లా కడెంకు చెందిన బుచ్చవ్వ, సత్తవ్వ మరికొంతమంది తప్పిపోయినట్లు తెలుస్తోంది. ఈనెల 29న కుంభమేళాకు 11 మంది మహిళలు వెళ్లారు.

Tags:    

Similar News