Lalu Prasad Health : మెరుగుపడుతున్న లాలూ ఆరోగ్యం
Lalu Prasad Yadav Health : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది;
Lalu Prasad Yadav Health : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఏయిమ్స్ వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో స్పష్టం చేశారు. ఇటీవళ లాలూ ప్రసాద్ యాదవ్ అకస్మాత్తుగా కింద పడడంతో యెముకలు దెబ్బతిన్నాయి. దీంతో హుటాహిటన పాట్నా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ ఏయిమ్స్‌కు షిఫ్ట్ చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లాలూ ప్రసాద్‌ను, వైద్యులను కలుసుకొని ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం లాలూ ఆరోగ్యం మెరుగుపడిందని తనయుడు తేజస్వి యాదవ్ మీడియాకు స్పష్టం చేశారు.
ధాన్యం కుంభకోణంలో లాలూ ప్రసాద్ జైలు శిక్షను అనుభవిస్తూ అనారోగ్యం రిత్యా బెయిల్ పై బయటకు వచ్చారు. మరో మూడు వారాల్లో ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి సింగపూర్ తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.