Congress Leader Shama : రోహిత్ శర్మ యావరేజ్ ప్లేయర్: కాంగ్రెస్ నేత షామా
రోహిత్ శర్మ యావరేజ్ ప్లేయర్, అత్యంత ఆకట్టుకోని కెప్టెన్ అని కాంగ్రెస్ మహిళా నేత డా.షామా చేసిన ట్వీట్‌పై ఫ్యాన్స్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ‘రోహిత్ ఫ్యాట్‌గా ఉన్నాడు. బరువు తగ్గాలి. ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడు. గంగూలీ, సచిన్, కోహ్లీతో పోలిస్తే అతనో సాధారణ ప్లేయర్’ అని ఆమె పేర్కొన్నారు. దీంతో ‘రాహుల్ నాయకత్వంలో పని చేసే మీకు కెప్టెన్సీ గురించి ఎలా తెలుస్తుందిలే’ అంటూ బీజేపీ నేతలు ఫైరవుతున్నారు. కాంగ్రెస్ నాయకురాలి కామెంట్లపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఈ వివాదంపై ఆమె స్పందిస్తూ.. ‘‘నేను కేవలం సాధారణ కోణంలోనే చెప్పాను. ధోనీ, కోహ్లీ, కపిల్ దేవ్ వంటి గత కెప్టెన్లను రోహిత్‌తో పోలుస్తూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశంలో మాకు మాట్లాడే హక్కు కూడా లేదా?’’ అని ప్రశ్నించారు.