Rajya Sabha : రాజ్యసభకు రామ్‌జీలాల్ సుమన్, జయా బచ్చన్, అలోక్ రంజన్ నామినేట్
ఉత్తరప్రదేశ్‌లోని రాజ్యసభ స్థానాలకు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) మంగళవారం రామ్‌జిలాల్ సుమన్, జయా బచ్చన్, మాజీ ఐఎఎస్ అధికారి అలోక్ రంజన్‌లను తమ అభ్యర్థులుగా ప్రతిపాదించింది. పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో వారు నామినేషన్ దాఖలు చేశారు.
రాజకీయవేత్తగా మారిన నటి జయ బచ్చన్ రాజ్యసభ స్థానానికి మళ్లీ నామినేట్ కాగా, అలోక్ రంజన్ తొలిసారి నామినేట్ అయ్యారు. రాజ్యసభకు ఎస్పీ అభ్యర్థులుగా సుమన్, బచ్చన్, రంజన్ ఉన్నారు. అంతకుముందు వారు ఈరోజు నామినేషన్లు దాఖలు చేస్తారని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. ఇదిలావుండగా, లోక్‌సభ ఎన్నికలకు ముందు అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఉత్తరప్రదేశ్‌లోని ఏడుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో నలుగురు వెనుకబడిన కులాలకు చెందినవారున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనున్నందున 56 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరుగుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ , పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్యతో సహా తొమ్మిది మంది కేంద్ర మంత్రుల స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి .