Sampark Kranti Express : రెండుగా విడిపోయిన సంపర్క్ క్రాంతి రైలు.. ఉన్నతస్థాయిలో విచారణ

Update: 2024-07-30 08:00 GMT

బీహార్లో సోమవారం జరిగిన రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతోంది. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలుకు భారీ ముప్పు తప్పింది. సమస్తిపూర్ వద్ద ఈ రైలు ఇంజిన్, రెండు బోగీల నుంచి ఇతర బోగీలు విడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనపై నిపుణుల బృందం దర్యాప్తును ప్రారంభించింది.

సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు రంగ నుంచి న్యూఢిల్లీకి వెళుతుండగా సమస్తిపూర్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రైలు తక్కువ వేగంతో వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సుమారు గంట పాటు శ్రమించి విడిపోయిన బోగీలను ఇంజిను కనెస్ట్ చేసినట్లు తూర్పు మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చంద్ర తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలను నిపుణుల బృందం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

కప్లింగ్ తెగిపోవడంతో సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు సమస్తిపూర్ - ముజఫర్ పూర్ రైల్వే సెక్షన్ లోని పూసా స్టేషన్ సమీపంలో ఇంజిన్, కోచ్ లను కలిపే కప్లింగ్ విరిగిపోవడంతో రైలు రెండు భాగాలుగా విడిపోయింది. విషయాన్ని గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలు ఇంజిన్ ను నిలిపివేశాడు. అకస్మాత్తుగా రైలు ఆగిపోవడంతో విషయం తెలుసుకున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సోన్పూర్ డివిజన్ అధికారులు దీని తర్వాత వచ్చే రైళ్లను ఎమర్జెన్సీతో నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది

Tags:    

Similar News