Sanjay Murthy : కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణస్వీకారం..తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు

Update: 2024-11-22 09:30 GMT

భారత్ కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ (కాగ్) జనరల్గా తెలుగు అధికారి కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ మూర్తి రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు సంజయ్ మూర్తి. 1989లో ఐఏఎస్ అధకారిగా హిమాచల్ కేడర్క ఎంపికయ్యారు. తర్వాత కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. 2021లో జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమలులో కీలక పాత్ర పోషించారు. ఐఏఎస్ అధికారిగా చేరిన ఆయన ఉద్యోగ విరమణ సమీపిస్తున్న తరుణంలో కేంద్రం కాగ్ జనరల్ గా కీలక పదవి ఇచ్చింది.

Tags:    

Similar News