మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు మంజూరు చేస్తామని SBI ప్రకటించింది. ‘అస్మిత’ పేరుతో ప్రత్యేక లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. మహిళా వ్యాపార, పారిశ్రామికవేత్తలకు సులభంగా లోన్లు అందిస్తామని పేర్కొంది. మహిళల కోసం ‘నారీ శక్తి’ డెబిట్ కార్డును రూపొందించినట్లు తెలిపింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా చౌక వడ్డీకే మహిళలకు లోన్లు ఇస్తామని ప్రకటించింది. మరోవైపు, మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన రూపే ఆధారిత ’నారీ శక్తి’ ప్లాటినం డెబిట్ కార్డును కూడా బ్యాంకు ఆవిష్కరించింది. ఇక మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ప్రవాస భారతీయులలో మహిళల కోసం 'బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ సేవింగ్స్ అకౌంట్' పేరిట ప్రత్యేక ఖాతాను ప్రారంభించింది.