నీట్ లో 99.99 శాతం మార్కులు.. మెడిసన్ చదవడం ఇష్టం లేదని ఆత్మహత్య
అనురాగ్ అనిల్ బోర్కర్ ఇటీవలే నీట్ యుజి 2025 పరీక్షలో 99.99 పర్సంటైల్‌తో ఉత్తీర్ణుడయ్యాడు మరియు OBC విభాగంలో 1475 ఆల్ ఇండియా ర్యాంక్‌ను సాధించాడు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల విద్యార్థి వైద్య కళాశాలలో అడ్మిషన్ కోసం బయలుదేరాల్సిన రోజున ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడిని అనురాగ్ అనిల్ బోర్కర్ గా గుర్తించారు. తాను డాక్టర్ అవ్వాలని అనుకోలేదని పేర్కొంటూ సూసైడ్ నోట్ రాసి ఉంచినట్లు తెలుస్తోంది.
నీట్ లో అంత పర్సంటేజ్ వచ్చినా మెడిసిన్ చదవాలనిపించలేదు అతడికి. మరి తల్లిదండ్రుల బలవంతమో, మరో కారణమో ఇష్టం లేని చదువు కొనసాగించడం కష్టమనుకున్నాడు. నిండు జీవితాన్ని బలి చేసుకున్నాడు.
సిందేవాహి తాలూకాలోని నవర్గావ్ నివాసి అయిన అనురాగ్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఇటీవలే నీట్ యుజి 2025 పరీక్షలో 99.99 శాతంతో ఉత్తీర్ణుడయ్యాడు. OBC విభాగంలో 1475 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. అతని విజయం తర్వాత, అతను MBBS కోర్సులో ప్రవేశం కోసం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అనురాగ్ గోరఖ్‌పూర్‌కు బయలుదేరే ముందు తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అతను ఇంట్లో ఉరివేసుకుని కనిపించాడు. సంఘటనా స్థలం నుండి ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్‌లోని విషయాలను అధికారులు మీడియాకు విడుదల చేయనప్పటికీ, తాను డాక్టర్ కావాలని కోరుకోవడం లేదని అనురాగ్ రాసినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.