Seema Haider: సచిన్ బిడ్డకు తల్లి కాబోతున్న సీమా హైదర్..!
తండ్రిగా సచిన్ మీనాకు ప్రమోషన్ !;
పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్ ఇంట్లో సంతోషం నెలకొంది. త్వరలో ఆమె తల్లికాబోతుంది.ఆమె బేబీ షవర్ వేడుక ఆదివారం గ్రేటర్ నోయిడాలోని రబుపురలో జరిగింది. ఈ వేడుకకు ఆమె న్యాయవాది డాక్టర్ ఎ.పి. సింగ్ తన తల్లితో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో, మహిళలు సాంప్రదాయ పాటలు పాడుతూ తమ ఆచారం ప్రకారం వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంతోష సమయంలో సీమ మాట్లాడుతూ.. తనకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారని చెప్పి్ంది. కానీ ఆమె బేబీ షవర్ వేడుక జరుపుకోవడం ఇదే మొదటిసారి అని వెల్లడించింది. ఇది సనాతన ధర్మ సంస్కృతి అని వెల్లడించింది. డాక్టర్ ఎ.పి. సింగ్ మాట్లాడుతూ, సీమాను తన సోదరిగా భావిస్తానని అన్నారు. ఆయన సీమా అలాగే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు.
యూపీలోని నోయిడాకు చెందిన సచిన్‌కు సీమా హైదర్ తో ఆన్‌లైన్ గేమ్ పబ్జీ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సీమా కంటే సచిన్ ఐదేళ్లు చిన్నవాడు. ఇలా మతం గోడలను, సరిహద్దులనే కాదు.. సమాజంలో తిష్ట వేసుకొని కుర్చున్న అనేక స్టీరియోటైప్ కాన్సెప్ట్స్‌ని ఈ ప్రేమ బ్రేక్ చేసింది. ఒక్క రోజూ కూడా ఇద్దరు మాట్లాడుకోకుండా ఉండలేకపోయేవాళ్లు. చివరికి కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఇండియా-పాకిస్థాన్ మధ్య వైరం ఎలా ఉందో వాళ్లకి తెలియనది కాదు.. కానీ కలిసే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. తన నలుగురి పిల్లలతో ముందుగా నేపాల్ వెళ్లిన సీమా అక్కడ నుంచి ఇండియాలోకి ప్రవేశించింది.
అక్రమంగా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సీమా నేరుగా సచిన్ దగ్గరకే వెళ్లిపోయింది. ఇద్దరు కలిసి ఒకటే అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. సీమా పాకిస్థాన్‌కు చెందిన మహిళ అని ఎవరికి తెలియకుండా సచిన్ జాగ్రత్త పడ్డాడు. కానీ చుట్టూ ఉన్నవాళ్లకి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు సచిన్, సీమాను అదుపులోకి తీసుకున్నారు. చట్టప్రకారం సీమా, సచిన్ చేసింది తప్పు. అందుకే ఈ విషయం ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది.