శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మలయాళ నటుడు దిలీప్‌కు వీఐపీ దర్శనం కల్పించడంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దిలీప్ కోసం భక్తులను చాలాసేపు క్యూలెన్‌లో ఆపేయడంపై తీవ్రంగా పరిగణించింది. దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది.
తాజాగా, శబరిమలలో వీఐపీ దర్శనాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. శబరిమలలో భక్తులు ఎవరికీ ప్రత్యేక పౌకర్యం లేదని తేల్చిచెప్పింది. శబరిమల ఆలయ 18 మెట్ల ముందు యాత్రికులకు అంతరాయం లేకుండా ఉండాలనే నియమాన్ని నటుడు దిలీప్ డిసెంబరు 5న బహిరంగంగా ఉల్లంఘించారని హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ఇది చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు సహా యాత్రికుల హక్కులను ప్రభావితం చేసిందని పేర్కొంది