Monkey Pox India : అప్పుడు మాత్రమే భారత్‌లోకి మంకీపాక్స్ వ్యాక్సిన్..
Monkey Pox India : మంకీపాక్స్ కేసులు అక్కడక్కడా కొంత నమోదవుతున్నా.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు
Monkey Pox India : మంకీపాక్స్ కేసులు అక్కడక్కడా కొంత నమోదవుతున్నా.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే భారత్‌లో మంకీ పాక్స్ నివారణకు వ్యాక్సిన్లకు సంబంధించి సీరమ్ ఇన్స్‌టిట్యూట్ అదర్ పూనావాలా కీలకమైన విషయాలను వెళ్లడించారు.
మంకీపాక్స్ వ్యాక్సిన్‌ను భారత్‌లో సొంతంగా కనుగ్గొని తయారు చేయాలంటే.. మరో ఏడాది పడుతుందన్నారు. ప్రస్తుతానికి డెన్మార్క్‌కు చెందిన ఓ సంస్థతో ఒప్పందాలు జరుపుతున్నామని.. ఒప్పందం కుదిరితే.. మూడు నెలల్లోనే మంకీపాక్స్ వ్యాక్సిన్లను భారత్‌కు దిగుమతి చేస్తామన్నారు.
అయితే కరోనా మహమ్మారిలా ఈ మంకీపాక్స్ వ్యాపించదని అన్నారు సీరమ్ ఛీఫ్. అయినప్పటికీ.. వ్యాధి వున్న ప్రాంతాల్లో ఈ మంకీపాక్స్ వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం ఉందన్నారు.
మంకీపాక్స్ అరికట్టడానికి ప్రత్యేకమైన వ్యాక్సిన్ కాకుండా స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా పనిచేస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీకే పాల్ స్పష్టం చేశారు. అనేక దేశాలు మంకీ పాక్స్ నివారించడానికి స్మాల్ పాక్స్ వ్యాక్సిన్లను అనుమతిస్తున్నట్లు చెప్పారు.