Uttar Pradesh Floods : ఉత్తరప్రదేశ్‌లో భయానకంగా వరదలు.. 22 మంది మృతి..

Uttar Pradesh Floods : ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 22మంది మరణించారు;

Update: 2022-09-18 11:09 GMT

Uttar Pradesh Floods : ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 22మంది మరణించారు. తూర్పు యూపీలో భారీ వర్షాలు పడుతాయని ఐడీఎం హెచ్చరికలతో అధికారులు అప్రమత్తయ్యారు. భారీ వర్షాలకు లక్నోలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. దీంతో పక్కనే గుడిసెల్లో నివసిస్తున్న వారిపై శిధిలాలు పడి 9 మంది కూలీలు మరణించారు. మరికొందరికి తీవ్రగాయలయ్యాయి.

క్షతగాత్రులను డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.ఇక ఉన్నావ్‌, ఫతేపూర్‌, ప్రయాగరాజ్‌, సీతాపూర్‌, రాయ్‌బరేలి, ఝాన్సీ జిల్లాల్లో వరద ఉధృతికి 13 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల పరిహారం ప్రకటించింది.

Tags:    

Similar News