PM Modi : భారత్ లో 2500 పార్టీలు.. మోడీ వ్యాఖ్యలకు షాకైన ఘనా ఎంపీలు

Update: 2025-07-04 06:30 GMT

ప్రధాని మోడీ ఘనా దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆ దేశ పార్లమెంట్‌ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇండియాలో 2500 పార్టీలు ఉన్నాయని మోడీ అన్నారు. దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. అది చూసి చిరునవ్వులు చిందించిన మోడీ.. ‘‘అవును మా దేశంలో 2500 పార్టీలు ఉన్నాయి. వివిధ పార్టీలు రాష్ట్రాలను పాలిస్తున్నాయి. వేలాది భాషాలు మా సంస్కృతిని చాటి చెబుతాయి. ఆ స్ఫూర్తివల్లే భారతీయులు ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలతో సులభంగా మమేకం అవగలుగుతున్నారని ప్రధాని అన్నారు.

ఘనా దేశపురస్కారాన్ని అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు మోడీ తెలిపారు. రెండు దేశాల సంబంధాల బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 2047నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు మోడీ తెలిపారు. బలమైన భారత్‌.. సుస్థిరమైన ప్రపంచానికి దోహదం చేస్తుందన్నారు. ఆఫ్రికా అభివృద్ధికి అండగా ఉంటామని మోడీ హామీ ఇచ్చారు.

G20 సదస్సుకు భారత్‌ సారథ్యం వహిస్తోన్న తరుణంలోనే ఆ గ్రూప్‌లో ఆఫ్రికా యూనియన్ శాశ్వత సభ్యత్వం పొందడం సంతోషంగా ఉందని మోడీ అన్నారు. కాగా మోడీ టూర్ లో రెండు దేశాల మధ్య పరిశోధన, అభివృద్ధి, ఔషధ తదితర రంగాలకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. అంతకుముందు మోడీని ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డుతో ఆ దేశం సత్కరించింది. ఆక్రాలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమానీ మోడీకి ఈ అవార్డును అందజేశారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు మోడీ వెల్లడించారు.

Tags:    

Similar News