MP Shashi Tharoor : పార్టీలో ఉండాలా వద్దా..? ఎంపీ శశిథరూర్ సీరియస్

Update: 2025-02-25 13:00 GMT

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శిశిథరూర్ హైకమాండ్ కు కీలక సందేశం పంపారు. కాంగ్రెస్ పార్టీకి శశి థరూర్ సేవలు అక్కర్లేకపోతే.. అతడు చేసుకోవడానికి ఇంకా ఇతర పనులు చాలా ఉన్నాయి అన్నది ఈ మెసేజ్. కేరళలోని వామపక్ష ప్రభుత్వంపై ఇటీవల ప్రశంసలు కురి పించాడని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.. శశి థరూర్ పై గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇలాంటి సందేశం పంపడం చర్చనీయాంశమైంది. 'పార్టీ నేను కావాలని కోరు కుంటే పార్టీ కోసం పనిచేస్తా, వద్దనుకుంటే నేను చేసుకునే సొంత పనులు చాలా ఉన్నాయి. కాలం గడపడానికి నాకు ఎలాంటి వ్యాపకాలు లేవని మీరు అనుకోవద్దు. నాకు చాలా వ్యాపకాలు ఉన్నాయి. పుస్తకాలున్నాయి. ప్రసంగాలున్నాయి. నా స్పీచ్ కోసం ప్రపంచ దేశాల నుంచి ఆహ్వానాలు ఉన్నాయి.' అని శశిథరూర్ కాంగ్రెస్ కు ఇచ్చిన మెసేజ్ లో తెలిపారు.

అదేవిధంగా మలయాళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశిథరూర్ పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళలో కాంగ్రెసు నాయ కుడు లేడని చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని, కానీ ఆ తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అవే ఫలి తాలు ప్రతిబింబించలేదని థరూర్ తెలిపారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలువా లంటే కాంగ్రెస్ పార్టీ మరింత విస్తరించాలని, లేకపోతే వరుసగా మూడోసారి కూడా ప్రతిపక్షా నికే పరిమితం కావడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేరళలో ప్రస్తుతం ఉన్న బలంతో గెలువడం అసాధ్యమని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోడీ భేటీని శశిథరూర్ ప్రశంసించారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన విమర్శలు ఎదుర్కోవడానికి కారణమైంది. అయితే థరూర్ మాత్రం తన వైఖరిని సమర్థించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి అభిప్రాయాలను తెలియజేసే హక్కు తనకుందని చెప్పారు. దౌత్యవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన శశిథరూర్ కేరళ నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 

Tags:    

Similar News