Shweta Singh Gaur: బీజేపీ నేత శ్వేత మృతి కేసులో బయటికొస్తున్న షాకింగ్ నిజాలు..

Shweta Singh Gaur: ఉత్తరప్రదేశ్‌ బండాకు చెందిన జేపీ నేత శ్వేతా సింగ్‌ గౌర్‌ మృతి స్థానికంగా కలకలం సృష్టించింది.

Update: 2022-05-02 14:31 GMT

Shweta Singh Gaur: ఉత్తరప్రదేశ్‌ బండాకు చెందిన జిల్లా పంచాయితీ సభ్యురాలు, బీజేపీ నేత శ్వేతా సింగ్‌ గౌర్‌ మృతి స్థానికంగా కలకలం సృష్టించింది. బుధవారం ఆమె స్వగ్రహంలో శవమై కనిపించారు. అయితే ఇటీవల తన మృతి వెనుక పలు సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. శ్వేతా ఆత్మహత్యకు తన భర్త దీపక్‌ గౌర్‌ హస్తమే ఉందని వార్తలు వస్తున్నాయి.

దీపక్ గౌర్‌కు ఫారిన్‌లో వ్యభిచార ముఠాలతో సంబంధం ఉందనే విషయం బయటికొచ్చింది. అయితే ఈ విషయం శ్వేతాకు కూడా తెలుసని తన కుటుంబ సభ్యులు అంటున్నారు. అంతే కాకుండా శ్వేతా ఒకట్రెండు సార్లు దీపక్ వ్యవహారాలకు సంబంధించిన ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేసిందని కూడా వారు అంటున్నారు. శ్వేతా సేకరించిన ఆధారాలన్నీ పోలీసులకు అప్పగించారు ఆమె కుటుంబ సభ్యులు.

దీపక్ అసాంఘిక కార్యకలాపాల గురించి శ్వేతాకు తెలిసిపోయింది కాబట్టే తనను దీపకే హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీపక్‌తో పాటు తన తండ్రి, తల్లి, అన్న కూడా ఈ మృతికి కారకులే అని వారు తెలిపారు. శ్వేతా కుటుంబ సభ్యులు చెప్పినదాని ప్రకారంగా దీపక్ కుటుంబంపై కేసు నమోదు చేశారు పోలీసులు.

దీపక్‌పై తన ఇద్దరు కూతుళ్లు కూడా ఇదే విధంగా ఆరోపిస్తున్నారు. తమ తండ్రికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆ విషయంపై తరచుగా ఇంట్లో గొడవలు జరుగుంటాయని వారు అంటున్నారు. అంతే కాకుండా ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో దీపక్‌కు మరో పెళ్లి చేయాలని తన కుటుంబ సభ్యులు అనుకున్నారని వారు చెప్తున్నారు. తరచుగా శ్వేతాపై దీపక్ దాడి చేస్తూ ఉన్నా.. పరువు పోకుడదనే ఇన్నిరోజులు భరించిందని కూతుళ్లు తెలిపారు.

Tags:    

Similar News