Shyam Pitrodas : చైనా శత్రువు కాదంటూ శ్యామ్ పిట్రోడా కాంట్రవర్సీ.. పొలిటికల్ హీట్

Update: 2025-02-18 12:15 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత, ఓవర్సీస్ యూనిట్ అధినేత శామ్ పిట్రోడా మరోసారి నోరుపారేసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేశారు. తన పార్టీకి వైఖరికి విరుద్ధంగా భిన్నమైన వాద నలు వినిపించి వివాదాస్పదం అయ్యాడు. చైనాను భారత దేశం శత్రువులా చూడొద్దని, పొరుగు దేశం నుంచి ఎదురయ్యే ముప్పు అనూహ్యంగా ఉంటుందని పిట్రోడా వ్యాఖ్యానించాడు. చైనాతో వైరం పెట్టుకునే రీతిలో ఇండియా వ్యవహరిస్తున్నదని, ఆ మైండ్ సెట్ ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పొరుగు దేశాన్ని గుర్తించి, గౌరవించాల్సిన సమయం ఆసన్నమైనదని తెలిపారు. చైనాను శత్రువుగా చూడటం మానుకోవాలని సూచించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పిట్రోడా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.

తొలి నుంచి చైనాతో భారత్ ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తోంది. ఈ స్వభావం ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతోంది. బీజింగ్ పట్ల మన విధానం దేశానికి కొత్త శత్రువును సృష్టిస్తోంది. భారత్ కు సరైన మద్దతు దక్కట్లేదు. ఇప్పటికైనా ప్రస్తుత విధానం మార్చుకోవాలి. ఇది కేవలం చైనా విష యంలోనే కాదు.. ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది. అయినా చైనా నుంచి ఏం ముప్పు ఉందో నాకు అర్థం కావడం లేదు. అమెరికా చైనాను తరచూ శత్రువుగా పేర్కొంటూ, భారత్ కు కూడా అదే పద్ధతి అలవాటు చేస్తోంది. అభివృద్ధిలో వెనుక బడిన దేశాలు వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. పేద దేశాలు మరింత వేగంగా అభివృద్ధి చెందాలి. 

Tags:    

Similar News